కేవలం రెండు రోజుల వ్యవధిలో వారు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. కాగా.. ఈ వైరస్ కారణంగా వనస్థలీపురంలోని ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో వారు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే... నగరంలోని వనస్థలిపురంలో నివాసముంటున్న (48) ఇటీవలే కరోనా పాజిటివ్ అనే తేలింది. దాంతో అతడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి సోదరుడి నుంచి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇటీవలే బాధితుడి తండ్రి (76) అనారోగ్యంతో చికిత్స పొందతూ మృతిచెందాడు. అతనికి అంత్యక్రియలు కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించడం గమనార్హం. కుటుంబసభ్యులంతా క్వారంటైన్ లో ఉండటంతో... ఇలా చేయాల్సి వచ్చింది.
అతన్ని పరీక్షించగా కరోనా సోకినట్టు తేలింది. కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఆ కుటుంబంలోని మరో 8 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ఉండే ప్రాంతమంతా కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.