కరోనా విషాదం: వేములవాడలో తండ్రీకొడుకులు మృతి

Published : May 05, 2021, 09:24 AM IST
కరోనా విషాదం: వేములవాడలో తండ్రీకొడుకులు మృతి

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా విషాదం చోటు చేసుకుంది. కరోనా వ్యాధితో వేములవాడలో తండ్రీకొడుకులు ఒకే రోజు మృత్యువాత పడ్డారు. సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ఓ కౌన్సిలర్ మరణించాడు.

కరీంనగర్: తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఒకే రోజు తండ్రీకొడుకులు మరణించారు. కరోనా వైరస్ సోకి వారిద్దరు మరణించారు. 

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుమ్మడి ప్రకాష్ (42) ఉదయం మరణించాడుయ ఆయన చిన్న కుమారుడు అభిజిత్ (18) సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత మరణించాడు. 

ఇదిలావుంటే, సిరిసిల్ల పట్టణం మున్సిపల్ కార్పోరేషన్ 26వ వార్డు కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కరోనా మరణించారు. 

కరోనా వైరస్ బారిన పడి కరీంనగర్  త్రీ టౌన్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సయ్యద్ సయీద్ (51)కరొనాతో ఒక ఆసుపత్రిలో మృతి చెందాడు. 1992 బ్యాచ్ కి చెందిన సయీద్ ప్రస్తుతం కాశ్మీర్ గడ్డ లో  కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. 

గత నెల 24 తేదీన కరోనా బారిన పడిన సయీద్  వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సయీద్ కు భార్య ,ఒక కూతురు,ఒక కుమారుడు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం