ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌కు తెలంగాణ సర్కార్ అనుమతి

By Siva KodatiFirst Published May 4, 2021, 7:03 PM IST
Highlights

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు తెలంగాణ వైద్య శాఖ అనుమతించింది. రాష్ట్రంలోని 45 ఏళ్లు పైబడి స్లాట్ బుక్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రైవేట్ ఆసుపత్రులు కంపెనీల నుంచి కోవిడ్ వ్యాక్సిన్‌ను కొనుక్కోవాలని వెల్లడించింది. 

మరోవైపు మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ, అందుకు తగ్గట్టుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా లేదు. ఇప్పటికే వేలాది మంది వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణలో ప్రైవేటు హాస్పిటళ్లకు కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Also Read:తెలంగాణలో కరోనా జోరు: 24 గంటల్లో 6876 కేసులు

ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న డోసులను మాత్రమే వాడుకొనేందుకు అనుమతించారు. మిగిలిన వ్యాక్సిన్ డోసులను వారి నుంచి సేకరించాలని మెడికల్ ఆఫీసర్లు, ఫార్మాసిస్ట్‌లకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దీనిపై ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం అప్పుడే సాధ్యం కాదని గురువారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
 
click me!