చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇదే తరహా ఘటన ఒకటి ఇవాళ వెలుగు చూసింది.
హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లిలో సోమవారం నాడు విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి. అప్పుల బాధ తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన రవి తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే రవి ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:అదే కొంపముంచింది: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్
ఓ స్కీంలో ఆదిక ఆధాయం కోసం పెట్టిన పెట్టుబడితో ఆర్ధికంగా రవి ఇబ్బందులకు గురైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.ఈ కారణంగానే రవి ఆత్మహత్య చేసుకున్నాడా ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:లోక్‌సభ ఎన్నికలు 2024: నేడు తొలి జాబితా విడుదల చేయనున్న బీఆర్ఎస్
ఆత్మహత్యలు పరిష్కారం కాదు
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.