ఖ‌మ్మంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు రోజువారీ కూలీలు మృతి, 12 మందికి గాయాలు

By Mahesh RajamoniFirst Published Apr 25, 2023, 3:38 PM IST
Highlights

Khammam: కారు-ఆటో ఢీ కొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 14 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్ర‌మాదం ఖ‌మ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
 

Repallevada Road Accident: కూలీ పనుల కోసం రోజువారీ కూలీల‌తో వెళ్తున్న ఒక ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 14 మంది గాయ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఇద్ద‌రు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రోజువారీ కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. వారు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఏన్కూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Latest Videos

ఈ రోడ్డు ప్ర‌మాదంలో మొత్తం 14 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరు మహిళలు మృతి చెందారని వైద్యులు తెలిపారు. వీరిని కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనుల కోసం వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో స్థానికులు తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన‌ట్టు స‌మాచారం.

మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవదహనం..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్-మొరాదాబాద్ లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంత్ రోడ్డులోని దివాన్ షుగర్ మిల్లు సమీపంలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీ కొనడంతో బుల్లెట్, ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో వస్త్ర వ్యాపారి కుమారుడు అభిషేక్ బజాజ్, అతనితో పాటు ఉన్న రాహుల్ కుమార్ మృతి చెందారు. ఈ ప్ర‌మాదం క్ర‌మంలో అక్క‌డ భారీగా ట్రాఫిక్ ఏర్ప‌డింది. పోలీసులు వాహనాలను క్లియర్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మాజోలాలోని మానస సరోవర్ కాలనీలో నివసించే మనోజ్ బజాజ్ కు బట్టల దుకాణం ఉంది. మంగళవారం ఉదయం మనోజ్ కుమారుడు అభిషేక్ బజాజ్ (35), రాహుల్ బుల్లెట్ బైక్ పై వెళ్తున్నారు. కాంత్ రోడ్డులోని దివాన్ షుగర్ మిల్లు ముందు చెరకు లోడ్ ట్రాలీని ప్ర‌మాదం నుంచి త‌ప్పించే క్ర‌మంలో చజ్లత్ నుంచి వస్తున్న ట్రక్కు బుల్లెట్ ను ఢీకొట్టింది. ఈ ఘర్షణ తర్వాత భారీ పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి.

click me!