కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్: గ్రామ పంచాయితీ పాలక వర్గం రాజీనామా, కలెక్టరేట్ ముట్టడి

By narsimha lode  |  First Published Jan 5, 2023, 10:36 AM IST

కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతులు  ఇవాళ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగనున్నారు.  పంటపొలాలను పరిశ్రమలకు తీసుకోవడంపై ఆందోళన చెందుతూ  రాములు అనే  రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.   


కామారెడ్డి:  కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్  ప్రతిపాదనను నిరసిస్తూ  రైతులు  గురువారంనాడు కలెక్టరేట్ ముట్టడికి   పిలుపునిచ్చారు.  మరో వైపు అడ్లూరు  ఎల్లారెడ్డి గ్రామపంచాయితీ  పాలకవర్గం రాజీనామా చేసింది.  వీరితో పాటు  వీడీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.  కామారెడ్డి  కొత్త మాస్టర్ ప్లాన్ ను  నిరసిస్తూ  గత నెల రోజులుగా  రైతులు  నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  పంట పొలాలను ఇండస్ట్రీయల్  కోసం  గుర్తించారని ఆవేదనతో   రాములు అనే రైతు బుధవారం నాడు  ఆత్మహత్య చేసుకున్నాడు.  తమ పంటపొలాలను   పరిశ్రమలకు కేటాయిస్తున్నారని రైతులు  ఆందోళనతో ఉన్నారు. ఈ కారణంానే రాములు  ఆత్మహత్య  చేసుకున్నారని  స్థానికులు  చెబుతున్నారు.  మరో వైపు  అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామపంచాయితీకి చెందిన ఉపసర్పంచ్ సహా  తొమ్మిది మంది వార్డు సభ్యులు  తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.   

కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తో  సుమారు  ఎనిమిది గ్రామాల రైతులు  కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు.  కలెక్టరేట్ ముట్టడికి రైతులు పిలుపునివ్వడంతో  పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు  ఏర్పాటు చేశారు.  కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని  రైతులు డిమాండ్  చేస్తున్నారు. నెల రోజులుగా  ఆందోళన నిర్వహిస్తున్నా  స్థానిక ప్రజా ప్రతినిధులు ఎందుకు  నోరు మెదపడం లేదో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం  ఎలా వస్తారో  చూస్తామని  హెచ్చరించారు.. కొత్త మాస్టర్  ప్లాన్ విషయమై  వెనక్కి తీసుకోకపోతే  ఎమ్మెల్యేలను  తమ గ్రామాల్లోకి రాకుండా  అడ్డుకుంటామని  రైతులు హెచ్చరించారు.
 

Latest Videos

 


 

click me!