Farmer Suicide: కేసీఆర్ కు సూసైడ్ లెటర్ రాసి రైతు ఆత్మహత్య... పరామర్శకు వెళ్లిన షర్మిల అరెస్ట్, ఉద్రిక్తత

By Arun Kumar P  |  First Published Dec 11, 2021, 2:09 PM IST

తన ఆత్మహత్యకు గల ప్రభుత్వ విధానాలే కారణమంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన రైతు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. 


మెదక్: తెలంగాణలో మరో అన్నదాత ఆత్మహత్య (telangana farmer suicide) చేసుకున్నాడు. టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్లే తాను తీవ్రంగా నష్టపోయానంటూ సూసైడ్ లెటర్ (Farmer suicide letter) రాసిపెట్టిమరీ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదం మెదక్ జిల్లా (medak district) హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కరణం రవి కుమార్ (karanam ravi kumar) కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉదయమే షర్మిల (ys sharmila) భూపతిపూర్ (bhupathipur) గ్రామానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం అక్కడే షర్మిల దీక్షకు (sharmilastrike) కూర్చున్నారు. పెద్దదిక్కును కోల్పోయిన రైతు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల దీక్ష చేపట్టారు. గ్రామస్తులు కూడా షర్మిలకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. 

Latest Videos

Video

పరామర్శకోసం వచ్చిన వచ్చిన షర్మిల హటాత్తుగా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా చేరుకున్న పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు, వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు కూర్చున్న షర్మిల చుట్టూ వలయంలా నిలబడి పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

read more  కేసీఆర్ కు లేఖ రాసి రైతు ఆత్మహత్య

అయితే ఎట్టకేలకు షర్మిల వద్దకు చేరుకున్న చేరుకున్న పోలీసులు ఆమెతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో దీక్షను కొనసాగిస్తానని షర్మిల చెప్పడంతో బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడినుండి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా వుండేదుకే షర్మిలను అక్కడినుండి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్ వేదికన షర్మిల స్పందిస్తూ ''ఈరోజు రైతు రవి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. రవి కుమార్ ది ఆత్మహత్య కాదు. ఇది KCR ప్రభుత్వం చేసిన హత్యే. వరి వేయొద్దనే అధికారం ముఖ్యమంత్రికి లేదు. KCR తీరుతో మరణించిన రవి కుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలి'' అని డిమాండ్ చేసారు. 

హావేలిఘనపూర్ మండలం బోగడ భూపతి పూర్ లో రైతు కర్ణం రవి కుమార్. ఆయ‌న పొలానికి నీళ్లు సౌక‌ర్యం ఉంది. దీంతో వర్షాకాలంలో ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు సన్నరకం వరి వేశాడు. కానీ, ఊహించ‌ని విధంగా  దిగుబడి తక్కువగా వచ్చింది. అయినా స‌రే పంట‌కు స‌రైన మ‌ద్ద‌తు రాక‌పోదా అని చూశాడు. కానీ, దొడ్డు ర‌కం వ‌డ్లు వ‌చ్చిన ధ‌ర‌నే స‌న్నాలు ల‌భించింది. స‌రేలే అని స‌ర్దుకుపోయాడు. యాసంగి లో పుష్కల‌మైన నీరు ఉంది.. మంచి దిగుబడి వ‌స్తోందని సాగు చేయాల‌ని భావించాడు.  

Video  జగిత్యాల: మంటల్లో చిక్కుకుని... పొలంలోనే అన్నదాత దుర్మరణం 

కానీ తెలంగాణ స‌ర్కార్ ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌రి సాగు చేయొద్ద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో  ఏం పండించాలనేది అర్థం కాని గందరగోళ ప‌డ్డారు. దీంతో ఏం చేయ‌లేని ప‌రిస్థితిలో  పురుగుల మందు తాగి రైతు కరణం రవికుమార్ (40) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు, ఈ క్ర‌మంలో త‌న బాధ‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ  సీఎం కేసీఆర్ కు లేఖ రాశాడు. 

''ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు యాసంగిలో  వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. తనను ఇంజినీరింగ్ చదివియ్యాలె’ అంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తూ.. సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో రవికుమార్ పేర్కొన్నాడు.

 

click me!