వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం: మూడు నెలల క్రితం భార్య.. తాజాగా భర్త, ఇద్దరు కుమార్తెలు

Siva Kodati |  
Published : Jun 26, 2022, 04:55 PM ISTUpdated : Jun 26, 2022, 04:56 PM IST
వికారాబాద్ జిల్లాలో ఫ్యామిలీ మిస్సింగ్ కలకలం: మూడు నెలల క్రితం భార్య.. తాజాగా భర్త, ఇద్దరు కుమార్తెలు

సారాంశం

వికారాబాద్ జిల్లాలో సత్యమూర్తి అనే వ్యక్తి కుటుంబం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అతను ముంబైలో వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసు బృందాలు  ముంబైకి బయల్దేరాయి.   

వికారాబాద్ జిల్లా (vikarabad district) తాండూరులో (tandur) సత్యమూర్తి కుటుంబం అదృశ్యం కావడం (missing case) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సత్యమూర్తి ముంబైలో వున్నట్లుగా తెలిసింది. దీంతో అతని కోసం ముంబై వెళ్లాయి ప్రత్యేక బృందాలు. 3 నెలల క్రితం సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది సత్యమూర్తి భార్య. దీంతో సెల్ఫీ వీడియో తీసి పోలీసులకు డెడ్‌లైన్ పెట్టి వెళ్లిపోయాడు సత్యమూర్తి. భార్యను గాలించే విషయంలో పోలీసులు పట్టించుకోవడం లేదని సత్యమూర్తి ఆరోపిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లతో సహా అతను అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.  

తన భార్య అదృశ్యం కేసు వెనక పెద్దవాళ్ల హస్తం ఉందని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని సత్యమూర్తి తెలిపాడు వాటిని పోలీసులకు ఇస్తానని... 48 గంటల్లో తన భార్య ఆచూకీ చెప్పకపోతే తన ఇద్దరు కూతుళ్లతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. తమ మృతదేహాలు ఎక్కడ వున్నాయనే లొకేషన్​ను సోషల్ మీడియాలో తెలియజేస్తానని సత్యమూర్తి చెప్పాడు. వాళ్ల సెల్ఫీ వీడియో వైరల్​ కావటం.. అందులో రెండు రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే చనిపోతానని చెప్పటం.. ఇవన్నీ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్