కారణమిదే: గుంటూరులో ప్రియురాలు, హైద్రాబాద్‌లో ప్రియుడు సూసైడ్

Published : Jun 21, 2018, 01:45 PM IST
కారణమిదే:  గుంటూరులో ప్రియురాలు, హైద్రాబాద్‌లో ప్రియుడు సూసైడ్

సారాంశం

ప్రియురాలు ఆత్మహత్య


హైదరాబాద్: గుంటూరులో బ్యూటీషీయన్ సిరి ఆత్మహత్య చేసుకొంది. హైద్రాబాద్‌లో మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే  ఈ రెండు ఆత్మహత్యల విషయమై  రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు విచారణ చేస్తుండగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది.  వీరిద్దరూ ప్రేమికులని తేలింది.  ఈ కేసు విషయమై  రెండు రాష్ట్రాల పోలీసులు  విచారణ చేస్తున్నారు.

యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టకు చెందిన సిరి బ్యూటీషీయన్‌గా పనిచేస్తోంది. ఆమె కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం  కుటుంబసభ్యులకు తెలిసింది.  అయితే  వీరి వివాహనికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన  ఆ యువతి గుంటూరులో ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తెలిపారు.

అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడినట్టు ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా తేలింది. దీంతో హైద్రాబాద్‌లో ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ నెంబర్ గురించి విచారించిన గుంటూరు పోలీసులకు  అతను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు.

అయితే వీరిద్దరూ ప్రేమించుకొన్నారని పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే వీరిద్దరి ఆత్మహత్యకు ఇతరత్రా కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. 


తాను ప్రేమించిన యువతి ఆత్మహత్యను తాను ఆపలేననే  ఉద్దేశ్యంతోనే ఆ యువకుడు  ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?
అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu