సరూర్ నగర్‌ : కాంట్రాక్టర్ వేధింపులు.. పిల్లలతో సహా భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

Siva Kodati |  
Published : May 25, 2022, 09:31 PM ISTUpdated : May 25, 2022, 09:33 PM IST
సరూర్ నగర్‌ : కాంట్రాక్టర్ వేధింపులు.. పిల్లలతో సహా భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

సారాంశం

కాంట్రాక్టర్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మానికి చెందిన అతను ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌ సరూర్ నగర్ వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.   

హైదరాబాద్ (hyderabad) సరూర్‌నగర్ (saroornagar) పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు పిల్లలకు నిద్రమాత్రలు వేసి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పిల్లలు వాంతులు చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడగా.. భార్యాభర్తల ఆరోగ్య పరిస్ధితి మాత్రం విషమంగా మారింది. రూ. 2 కోట్ల వరకూ రావాల్సిన కాంట్రాక్ట్​ బిల్లులు (contract bills) రాకుండా ఓ వ్యక్తి అడ్డుకోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు (khammam) చెందిన దంపతులు శశికుమార్​, శ్వేత తమ ఇద్దరు పిల్లలతో సహా హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​(dilsukhnagar) లోని లాడ్జిలో దిగారు. అనంతరం పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చి.. భార్య శ్వేతతో పాటు తానూ తీసుకున్నారు. అంతకుముందుగా సెల్ఫీ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సూసైడ్​ లెటర్​తో పాటు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనకు రావాల్సిన కాంట్రాక్టు బిల్లులు రావడంలేదని... ఆ డబ్బులు ఇవ్వకుండా దినేష్​ రెడ్డి అనే కాంట్రాక్టర్​ వేధింపులకు గురిచేయడంతోపాటు... ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవ్వడంతో మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే