ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తామంటూ మోసం.. మనిషికి రూ.5 లక్షల టోకరా

By sivanagaprasad KodatiFirst Published Aug 28, 2018, 12:44 PM IST
Highlights

కేంద్ర, రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన నలుగురు సభ్యుల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు

కేంద్ర, రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన నలుగురు సభ్యుల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అంకమామిడి శ్రీకాంత్, సంజయ్, బండారు గౌరీ శంకర్, దంతూరి ఉమాదేవిలు ఓ ముఠాగా ఏర్పడి.. తెలిసిన వారికి, బంధువుల్లో కొందరికి తాము ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఇందుకు రూ.16 లక్షలు ఖర్చు అవుతుందని నమ్మించేవారు.

వారికి నమ్మకం కుదిరాక అడ్వాన్స్ కింద రూ. 5 లక్షలు వసూలు చేసేవారు. అనంతరం నకిలీ ఈమెయిల్స్ నుంచి కాల్ లెటర్స్, జాయినింగ్ లెటర్స్ పంపేవారు. కొద్దిరోజుల క్రితం వీరిలో కొంతమందిని రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు గుంజారు. అనంతరం ట్రైయినింగ్ ఉందని ఢిల్లీలో వదిలి వచ్చేశారు.

ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మరికొందరిని వెతికే పని ప్రారంభించారు. కొందరు ఉద్యోగార్థులు ఈ ముఠాను కలిసి.. ఉద్యోగం కావాలని కోరారు.. అయితే వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నకిలీ పత్రాలు, స్టాంపులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

click me!