ఆరోగ్యం బాగు చేస్తానని పూజలు, ఆపై లోబరచుకునే యత్నం .. దొంగబాబాకి దేహశుద్ధి చేసిన మహిళలు

Siva Kodati |  
Published : Jun 10, 2023, 03:40 PM IST
ఆరోగ్యం బాగు చేస్తానని పూజలు, ఆపై లోబరచుకునే యత్నం .. దొంగబాబాకి దేహశుద్ధి చేసిన మహిళలు

సారాంశం

మహిళపై వేధింపులకు పాల్పడుతున్న దొంగబాబాకి మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూరులో దేహశుద్ధి చేశారు మహిళలు . జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూరులో దొంగబాబాకు దేహశుద్ధి చేశారు మహిళలు . వివరాల్లోకి వెళితే.. తొర్రూరుకు చెందిన ఓ వ్యక్తి.. జాతకాలు చెబుతానని, అనారోగ్యంతో వున్న వారికి నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పేవాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అనారోగ్యం, తదితర కారణాలతో దొంగ బాబాను ఆశ్రయించింది. దీనిని అదనుగా చేసుకున్న అతను.. ఆమెను లోబరచుకోవాలని యత్నించాడు. పూజల సమయంలో తీసిన నగ్న ఫోటోలు, వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 

తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన మహిళా సంఘం ప్రతినిధులు.. తొర్రూరులో దొంగ బాబాపై రెక్కీ నిర్వహించి.. శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు.. అతనికి దేహశుద్ధి చేసి , జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్