హెచ్​సీఏలో నిధుల గోల్ ​మాల్.. హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

By Rajesh Karampoori  |  First Published Oct 28, 2023, 5:22 AM IST

Hyderabad Cricket Association: హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టును ఆశ్రయించారు. 


Hyderabad Cricket Association:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ లో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పై కేసు నమోదయ్యాయి. దీంతో ఆయన హైకోర్టుకు ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజారుద్దీన్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్లల విషయం టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు కట్టబెట్టారని, భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆడిట్ నిర్వహించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ నిర్ధారించింది. అగ్నిమాపక, జిమ్‌సామాగ్రి,  క్రికెట్‌ బంతులు, బకెట్‌కుర్చీల తదితర వస్తువుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు కమిటీ  గుర్తించింది.

Latest Videos

undefined

2019- 2022 మధ్య అపెక్స్‌ కౌన్సిల్‌ ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగాయని తెలింది. ఈ సమయంలో  అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్ గా ఉన్నా అజహరుద్దీన్‌పై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అజారుద్దీన్‌ అండ్ కో కోట్ల రూపాయల నిధులను  పక్కదారి పట్టించిందని, టెండర్ల పేరుతో థర్డ్ పార్టీ కి నిధులు కట్టబెట్టిందని హెచ్‌సీఏ నిధులపై ఆడిట్ నిర్వహించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ నిర్ధారించింది.  

ప్రధానంగా క్రికెట్ బాల్స్ కొనుగోలు లో భారీ అవినీతి జరిగిందనీ కమిటీ తేల్చింది. ఒక్కో బాల్ ను రూ. 392 బదులు రూ. 1400 లకు ఆర్డర్ ఇచ్చారని, ఇలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు నష్టం కలిగిందని  జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ  తెలిపింది. అలాగే బకెట్ చైర్స్ కొనుగోలు విషయం లో కూడా 43 లక్షలు నష్టం జరిగిందని కనుగొన్నారు. అగ్నిమాపక పరికరాల పేరుతో 1.50 కోట్లు ఖర్చు, ఇక జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు వేచించినట్టు కమిటీ అభిప్రాయపడింది.

ఇలా కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసినట్టు కమిటీ నివేదికను‌ ఇచ్చింది. 2019-2022 మధ్య అక్రమాలు జరిగాయని, ఆ సమయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ ఉన్నారని విచారణ కమిటీ నిర్ధారించింది.హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజారుద్దీన్‌ పై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజారుద్దీన్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

click me!