పెళ్లయిన వ్యక్తితో వివాహేతర సంబంధం... పుట్టిన పసిగుడ్డును యువతి ఏం చేసిందంటే...

Arun Kumar P   | Asianet News
Published : Mar 29, 2022, 11:13 AM IST
పెళ్లయిన వ్యక్తితో వివాహేతర సంబంధం... పుట్టిన పసిగుడ్డును యువతి ఏం చేసిందంటే...

సారాంశం

పెళ్లయి భార్యాపిల్లలున్న వ్యక్తితో అక్రమసంబంధం కారణంగా గర్భందాల్చి బిడ్డకు జన్మనిచ్చిందో యువతి. ఇలా పెళ్లికిముందే పుట్టిన బిడ్డను మరో మహిళకు అమ్మి అడ్డంగా బుక్కయిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. 

వరంగల్: పెళ్లయి భార్యాపిల్లలున్నా మరో యువతిపై కన్నేసాడో నీచుడు. మాయమాటలు చెప్పి యువతిని శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసాడు. ఇలా పెళ్ళికాకుండానే తల్లయిన యువతి పుట్టిన బిడ్డను పిల్లలు లేని మరో మహిళకు అమ్ముతూ అడ్డంగా దొరికిపోవడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఏటూరునాగారం మండలంలోని బుటారం గ్రామానికి చెందిన ఆత్యూరి రవీందర్ కు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయినప్పటికి అతడి కన్ను మరో పెళ్లికాని యువతిపై పడింది. ప్రేమ పేరిట యువతి వెంటపడుతూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. అతడి ప్రేమ నిజమేనని నమ్మిన యువతి శారీరకంగా కూడా దగ్గరయ్యింది. ఇలా పలుమార్ల వీరు ఒక్కటవడంతో యువతి గర్భం దాల్చింది. 

ఈ విషయాన్ని ప్రియుడు రవీందర్ కు తెలపగా అప్పటినుండి యువతిని దూరంపెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ప్రియుడి గురించి ఆరాతీయగా అతడికి ఇదివరకే పెళ్లయి పిల్లలు కూడా వున్నట్లు బాధిత యువతికి తెలిసింది. దీంతో ఇప్పుడు తన పరిస్థితి, కడుపులో పెరుగుతున్న మన బిడ్డ పరిస్థితి ఏంటంటూ పలుమార్లు రవీందర్ ను నిలదీసింది. అప్పటికప్పుడు ఏదోటి సర్దిచెప్పి ఆ తర్వాత తప్పించుకు తిరగసాగాడు. ఈ క్రమంలోనే యువతి బిడ్డకు జన్మనిచ్చింది. 

అటు తల్లినిచేసిన వాడు బిడ్డను చూడటానికి కూడా రాకపోవడం... పెళ్లి కాకుండానే ఒంటరిగా వుంటూ బిడ్డను పెంచిపోషించలేనని భావించిందో ఏమోకానీ బాధిత యువతి దారుణానికి ఒడిగట్టింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను పిల్లలు లేని మరో మహిళకు అమ్మడానికి సిద్దమయ్యింది. డెలివరీ ఖర్చులను భరించడంతో పాటు మరికొన్ని డబ్బులు ఇవ్వడానికి గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మౌనిక సిద్దమవగా ఆమెకు తన బిడ్డను ఇవ్వాలని యువతి నిర్ణయించుకుంది. 

ఇలా పదిరోజుల పసిగుడ్డును తల్లి అంగీకారంతోనే దత్తత తీసుకుంటున్నట్లు అగ్రిమెంట్ రాసుకుంది మౌనిక. అయితే ఈ విషయం బయటపడటంతో పోలీసులు రంగంలోకి దిగి బాధిత యువతితో పాటు దత్తత తీసుకున్న మౌనికను కూడా అదుపులోకి తీసుకున్నారు. యువతి నుండి పూర్తి వివరాలు సేకరించి బిడ్డ తండ్రి రవీందర్ ను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి చట్టబద్దంగా బిడ్డను దత్తత తీసుకోవాలని మౌనికకు సూచించారు. అలాగే యువతికి న్యాయం చేయాలని రవీందర్ కు సూచించారు. అప్పటివరకు పసిబిడ్డ కన్నతల్లి సంరక్షణలోనే వుంటుందని... మరోసారి అక్రమంగా బిడ్డను  అమ్మడానికి  చూస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే