కొండా దంపతులను తరిమికొట్టాలి

Published : Sep 25, 2018, 03:54 PM IST
కొండా దంపతులను తరిమికొట్టాలి

సారాంశం

కొండా సురేఖ దంపతులు ఉద్యమ ద్రోహులు.. వారిని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీఆర్‌ఎస్ నేత బస్వరాజు సారయ్య పిలుపునిచ్చారు. 


కొండా సురేఖ దంపతులను తెలంగాణ నుంచి తరమికొట్టాలని టీఆర్ఎస్ నేత బస్వరాజు సారయ్య పిలుపునిచ్చారు. కొండా సురేఖ దంపతులు.. కేసీఆర్, కేటీఆర్ లపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ కొండా దంపతులపై ఈ విషయంలో మండిపడగా.. తాజాగా బస్వరాజు సారయ్య కూడా ఈ విషయంపై స్పందించారు. కొండా సురేఖ దంపతులు ఉద్యమ ద్రోహులు.. వారిని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీఆర్‌ఎస్ నేత బస్వరాజు సారయ్య పిలుపునిచ్చారు. ఇవాళ వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

టీఆర్‌ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే తమ అధినేత అని చెప్పిన సారయ్య.. కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థినే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని తేల్చిచెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కొండా దంపతుల పాలన నుంచి వరంగల్ వాసులు విముక్తి పొందారని సారయ్య అన్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్