టీఆర్ఎస్ కు షాకిస్తున్న నేతల మరణాలు.. మరో సీనియర్ కన్నుమూత..

By AN TeluguFirst Published Dec 5, 2020, 8:55 AM IST
Highlights

టీఆర్ఎస్ సీనియర్ నేత కమతం రాంరెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. 83యేళ్ల రాంరెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్లోనే రాజకీయాలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. 

అప్పటి టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పరిగి నుంచి అసెంబ్లీ కి పోటీ చేశారు. అయితే ఆయన అప్పుడు మూడో స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. అయితే 2018 ఎన్నికల సమయానికి బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. 

ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక కేసీఆర్ సమక్షంలో కమతం రాంరెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. కాకపోతే వయోభారం కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

కమతం రాంరెడ్డి గతంలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకట్రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా వారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా పనిచేశారు. ఇక ఈ మాజీ మంత్రి వయోభారంతో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది.

click me!