స్వతంత్ర అభ్యర్ధిగా జలగం వెంకట్రావు.. కొత్తగూడెంలో త్రిముఖ పోటీ, ఎవరిని ముంచుతారో

By Siva Kodati  |  First Published Nov 9, 2023, 6:07 PM IST

మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం టికెట్ దక్కుతుందని ఆశించిన వెంకట్రావుకు నిరాశ తప్పలేదు. కాంగ్రెస్‌లోనూ టికెట్ దక్కుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని జలగం డిసైడ్ అయ్యారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయగా.. రేపు సాయంత్రంతో నామినేషన్ దాఖలకు గడువు ముగియనుండటంతో టికెట్లు దక్కని ఆశావహులు రెబల్‌గా , స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. రేపు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన హైదరాబాద్ నుంచి కొత్తగూడెం బయల్దేరినట్లుగా సమాచారం. 

బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం టికెట్ దక్కుతుందని ఆశించిన వెంకట్రావుకు నిరాశ తప్పలేదు. ఏడెనిమిది మందిని మినహా మిగతా అందరు సిట్టింగ్ లకు అధినేత కేసీఆర్ మరో అవకాశం ఇచ్చారు. ఇటీవల కొత్తగూడెం టికెట్ కూడా వనమా వెంకటేశ్వర రావుకు దక్కింది. దీంతో జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తికి గురయి పార్టీకి రాజీనామా చేసాడు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించిన వెంకట్రావు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 

Latest Videos

undefined

ALso Read: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ... మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా, కాంగ్రెస్ లో చేరి పోటీకి సై..

తొలుత కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం టికెట్ ఇచ్చేందుకు సిద్దంగా వుండటంతో ఆ పార్టీలో చేరేందుకు జలగం వెంకట్రావు సిద్దమయ్యారు. అయితే ఆ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకే కేటాయించడంతో ఆయన మరోసారి నిరాశకు గురయ్యారు. టికెట్ దక్కుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని జలగం డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగడం వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

click me!