బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

Published : Nov 24, 2018, 09:43 AM IST
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి

సారాంశం

తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత  పుష్పలీల ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. 

తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత  పుష్పలీల ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. శనివారం ఆమె.. కాంగ్రెస్ లో చేరనున్నారు. బీజేపీ పార్టీ అవలంభిస్తున్న విధి విధానాలు నచ్చక.. పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో బీజేపీ కీలుబొమ్మ అని, పార్టీ లో మహిళలను, దళితులను చులకన భావంతో చూస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించడానికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ బీజేపీ ఓడిపోవడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్  లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. 

PREV
click me!

Recommended Stories

యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family