మునుగోడు ఉపఎన్నిక : చండూరులో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్

Siva Kodati |  
Published : Nov 03, 2022, 04:33 PM IST
మునుగోడు ఉపఎన్నిక : చండూరులో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్

సారాంశం

మునుగోడు ఉపఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ.. అక్కడక్కడా ఘర్షణలు జరుగుతూనే వున్నాయి. చండూరులో టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే లాఠీఛార్జీ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు

మునుగోడు ఉపఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ.. అక్కడక్కడా ఘర్షణలు జరుగుతూనే వున్నాయి. చండూరులో టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే లాఠీఛార్జీ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. చండూరులో నాన్ లోకల్స్ వచ్చి డబ్బులు పంచుతున్నారని.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

ఇకపోతే... పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లను బీజేపీ ప్రలోభపెడుతుందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ  మేరకు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కి గురువారంనాడు ఫిర్యాదు చేశారు.చౌటుప్పల్,సంస్థాన్ నారాయణపురం,జనగామ,చండూరు,మర్రిగూడలలో బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని  మంత్రి జగదీష్ రెడ్డి పిర్యాదు  చేశారు.

ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఓటర్లకు ప్రలోభాల విషయమై టీఆర్ఎస్ ,బీజేపీ పరస్పరం పిర్యాదు చేసుకున్నాయి.అంతేకాదు స్థానికేతరులు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని  బీజేపీ ఆరోపించింది.ఈ విషయమై చండూరు,మర్రిగూడల్లో బీజేపీ,టీఆర్ఎస్  వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మర్రిగూడలో  ఆందోళన చేసిన బీజేపీ శ్రేణులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు.సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో ఉన్నస్థానికేతరులను ఎన్నికల  అబ్జర్వర్ పట్టుకున్నారు.ఫంక్షన్ హల్ లో నగదు,మద్యం సీజ్ చేశారు.

ALso REad:ఓటర్లను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుంది:తెలంగాణ సీఈఓకి మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ  నియోజకవర్గంలో 2,41855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే