వికారాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. స్థల పరిశీలన

Published : Dec 29, 2018, 12:54 PM IST
వికారాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. స్థల పరిశీలన

సారాంశం

వికారాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం కోసం శనివారం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. 

వికారాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం కోసం శనివారం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. డెంటల్ కాలేజీ సమీపంలో, శివారెడ్డి పేట, ఎన్నేపల్లి ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చించి ఏ ప్రాంతంలో భవన నిర్మాణం ప్రారంభించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. త్వరలో స్థల సేకరణ పూర్తి చేసి.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. 

కేటీఆర్ న్యాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారుతుందని ఈ సందర్భంగా ఆయన  చెప్పారు. ఆయన వెంట పార్టీ పరిశీలకులు ఎంఎల్సీ గంగాధర్ గౌడ్,
ఎంఎల్ఏ ఆనంద్,టీఎస్ విద్యా వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ లు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?