పదవి అవసరం లేదు.. హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్

By telugu teamFirst Published Jun 28, 2019, 2:04 PM IST
Highlights

ప్రజా సేవ చేయడానికి పదవులే అవసరం లేదని  తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రజా సేవ చేయడానికి పదవులే అవసరం లేదని  తెలంగాణ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రజా జీవితంలో పదవితో అసలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పనిచేయాలని ఉంటే ఎలాగైనా చేయవచ్చని ఆయన చెప్పారు. రాజకీయాల్లో పదవీ విరమణ అంటూ ఉండదని ఆయన అన్నారు. 

సంగారెడ్డి జడ్పీ ఛైర్మన్ రాజమణి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. ‘‘ఈ వీడ్కోలు పదవికే కానీ.. మన సంబంధాలు, ప్రజా సేవకు కాదు. మంచిగా ఆలోచించండి.. మంచిగా జీవించండి.’’ అని హరీష్.. రాజమణికి సూచించారు.

జిల్లా పరిషత్‌ను రాజమణి బాగా నడిపించారన్నారు. పదవి కాలంలో ఎంత గొప్పగా పని చేశామన్నదే ముఖ్యం కాదని.. పదవి కాలంలో చేసే మంచి పనులే ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. గతనికి ఈ ఐదేళ్లకు జడ్పీలో చాలా తేడా ఉందని.. గతంలో మధ్యాహ్నం వరకు కరెంట్ మీదే చర్చ జరిగేదన్నారు.
 
తెలంగాణ ప్రభుత్వంలో ఆ సమస్య లేకుండా పోయిందన్నారు. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ అడిగినన్ని ట్రాన్స్ ఫార్మర్‌లు ఇచ్చారని ఈ సందర్భంగా హరీష్ చెప్పుకొచ్చారు. గతంలో మంచి నీటి సమస్య బాగా ఉండేదని.. ఇవాళ మిషన్ భగీరథ వచ్చాక 90 శాతం సమస్య తీరిందన్నారు. దశాబ్దాల కాలంలో జరగని పనులు మీ హయాంలో జరగడం సంతోషంగా ఉందని హరీష్ చెప్పుకొచ్చారు.

click me!