కేసీఆర్ జాతీయ పార్టీ : హైదరాబాద్‌కు చేరుకున్న కుమారస్వామి... రేపు టీఆర్ఎస్ జనరల్ మీటింగ్‌కి హాజరు

By Siva KodatiFirst Published Oct 4, 2022, 8:16 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేపు టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి కుమారస్వామి హాజరుకానున్నారు. 

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేపు టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి కుమారస్వామి హాజరుకానున్నారు. టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశానికి జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా హాజరుకానున్నారు. ఇకపోతే.. గత నె 11న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమారస్వామి భేటీ అయిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా నాడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం దేశానికి అవసరమని కుమారస్వామి. సకలవర్గాలను కలుపుకొని కేసీఆర్ తెలంగాణను సాధించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కుమారస్వామి పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక భూమిక పోషించాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి ప్రకటించారు. 

ALso REad:కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన : మందు, కోళ్లు పంచిన టీఆర్ఎస్ నేత.. వీడియో వైరల్

త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కేసీఆర్  కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు.  వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొందన్నారు. ఈ తరుణంలో  కెసిఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. తమ నడుమ అర్థవంతమైన చర్చ సాగిందని కుమారస్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి దేశమంతా చర్చిస్తుందన్నారు.

ఇకపోతే... బుధవారం ఉదయం 11 గంటలకు  తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహంచనున్నారు  జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు.  ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా  మార్చాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 5వ తేదీన నిర్వహించే సమావేశంలో తీర్మానం చేయనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ఈ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఈ నెల 6వ తేదీన  అందజేయనుంది. 
 

click me!