నన్ను కోవర్ట్ అంటారా... రోజుకొక బండారం బయటపెడతా : కేసీఆర్‌కు రవీందర్ సింగ్ వార్నింగ్

Siva Kodati |  
Published : Nov 27, 2021, 06:10 PM IST
నన్ను కోవర్ట్ అంటారా... రోజుకొక బండారం బయటపెడతా : కేసీఆర్‌కు రవీందర్ సింగ్ వార్నింగ్

సారాంశం

తెలంగాణ కోసం.. టీఆర్ఎస్ (trs) కోసం అహర్నిశలు కృషి చేసిన తననే కోవర్ట్ అంటారా అంటూ ఆ పార్టీ మాజీ నేత, కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) ఫైరయ్యారు. నా నామినేషన్ తిరస్కరించే కుట్ర చేశారని.. తనను ప్రపోజ్ చేసిన వాళ్లను బెదిరించి ఫోర్జరీ చేశారని కేసు పెట్టించాలని చూశారని రవీందర్ సింగ్ ఆరోపించారు. 

తెలంగాణ కోసం.. టీఆర్ఎస్ (trs) కోసం అహర్నిశలు కృషి చేసిన తననే కోవర్ట్ అంటారా అంటూ ఆ పార్టీ మాజీ నేత, కరీంనగర్ (karimnagar) మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) ఫైరయ్యారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ బండారం రోజుకొకటి బెయటపెడ్తానని హెచ్చరించారు. నా నామినేషన్ తిరస్కరించే కుట్ర చేశారని.. తనను ప్రపోజ్ చేసిన వాళ్లను బెదిరించి ఫోర్జరీ చేశారని కేసు పెట్టించాలని చూశారని రవీందర్ సింగ్ ఆరోపించారు. 

తనకు మద్దతిచ్చిన వారిని భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తే.. వాళ్లు భయపడకుండా ఆ సంతకాలు మావేనని కలెక్టర్ ముందు చెప్పారని ఆయన తెలిపారు. అయినా ఎన్నికల అధికారి మూడు గంటలపాటు ఇబ్బంది పెట్టి చివరికి తన నామినేషన్ ఆమోదించారని రవీందర్ సింగ్ వెల్లడించారు. దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ వాళ్లకు, మంత్రులకు చెప్పాను, నా నామినేషన్ మీద వాళ్ళు దృష్టి పెట్టారంటేనే నేను నైతికంగా విజయం సాధించినట్లేనని ఆయన పేర్కొన్నారు. 

అర్జునగుట్టలోని ఆలయంలో తనకు ఎమ్మెల్సీ (mlc) ఇస్తానని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని రవీందర్ సింగ్ గుర్తుచేశారు. మేయర్ పదవి పోయాక కూడా తన జన్మదినం రోజున కేసిఆర్ (kcr) తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మంత్రుల ముందు, నేతల ముందు చెప్పారని ఆయన వెల్లడించారు. మేయర్‌గా పనిచేసిన తాను కార్పొరేటర్‌గా ఉండనని చెప్పినా.. సీఎం చెప్పడంతో కొనసాగానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన మంత్రి తనను అవమానాలకు గురి చేశారుని రవీందర్ సింగ్ ఆరోపించారు. 

Also Read:కేసీఆర్‌కు సర్దార్‌ షాక్‌.. టీఆర్ఎస్‌కు రవీందర్‌ సింగ్‌ రాజీనామా, ఎన్నోసార్లు మాట తప్పారంటూ లేఖ

టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన భాను ప్రసాద్ రావు (bhanu prasada rao) తెలంగాణ ఉద్యమంలో (telangana movement) ఎక్కడ పని చేశారు? అని ఆయన ప్రశ్నించారు. 12 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ రావు 12 రోజులైనా కరీంనగర్ లో ఉన్నారా..? ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలు గురించి ఎప్పుడైనా మాట్లాడారా?పంచాయతీరాజ్ చట్టం గురించి మండలి లో ఒక్క మాట అయినా భానుప్రసాద్ మాట్లాడారా..? అని రవీందర్ సింగ్ నిలదీశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏనాడూ శిక్షణ శిబిరాలు పెట్టని భాను ప్రసాదరావు ఇప్పుడు మాత్రం క్యాంపులు పెడుతున్నాడని ఆరోపించారు. 

ఉద్యమాన్ని దూషించిన వాళ్లను, ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. మానుకోటలో రాళ్లువిసిరిన కౌశిక్ రెడ్డికి (koushik reddy) ఎమ్మెల్సీ ఇచ్చారని, 24 గంటల్లోపే ఆయనకు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులు లేరా? వెంకటరామిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు? ఉద్యమకారులకు పాలనలో అవకాశం ఇస్తే ప్రజల కష్టాలు తీరేలా పని చేస్తారని రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 

తనకు మేయర్‌గా అవకాశం వచ్చినప్పుడు రూపాయికే అంత్యక్రియలు, ఒక రూపాయికి నల్లా కనెక్షన్ వంటి పథకాలు తెచ్చానని గుర్తు చేశారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ నేను తెస్తే.. ఆ పథకం పేరిట చాలా మంది ఇళ్లు కట్టుకున్నారని.. కార్లు కొనుక్కున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. తెలంగాణలో ఉద్యమ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ కాకుండా మెయింటినెన్స్ బ్యాచ్ కూడా మొదలయిందని ఆయన విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?