నేషనల్ హెరాల్డ్ కేసు : ఈడీ ఎదుట హాజరైన కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

By Siva KodatiFirst Published Nov 23, 2022, 3:30 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేలు ఈడీ ఎదుట విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా లిమిటెడ్‌కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ఏ ప్రకారం ఈయనను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఈ కేసుకు సంబంధించి గత నెల 3వ తేదీనే అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోయారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేలు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 

నేషనల్ హెరాల్డ్ అంటే ఏమిటీ?

నేషనల్ హెరాల్డ్ అనేది ఒక న్యూస్ పేపర్. దీన్ని దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించారు. పలువురు ఫ్రీడమ్ ఫైటర్లు కలిసి 1937లో స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఈ పత్రికను పబ్లిష్ చేసింది. ఏజేఎల్‌లో అప్పుడు సుమారు 5000 మంది ఫ్రీడమ్ ఫైటర్లు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ అప్పటికే కౌమీ ఆవాజ్ అనే ఉర్దూ దిన పత్రిక, నవజీవన్ అనే హిందీ దినపత్రికలను ప్రచురిస్తున్నది.

Also REad:National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ? సోనియా, రాహుల్‌కు సంబంధం ఏమిటీ?

అప్పటి మేధావులు, ప్రభావవంతులు ఫోకస్ పెట్టడంతో నేషనల్ హెరాల్డ్ పేపర్ ఒక జాతీయవాద పత్రికగా పేరొందింది. అనతి కాలంలో పేరు సంపాదించింది. ఇందులో ముఖ్యంగా నెహ్రూ.. బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ ఘాటైన పదాలతో వ్యాసాలు రాసేవారు. దీంతో పత్రికను 1942లో బ్రిటీష్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. మళ్లీ మూడేళ్లకు రీఓపెన్ చేశారు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత నెహ్రూ ఈ పత్రిక బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పత్రిక భావజాలాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. కానీ, ఆర్థిక కారణాలతో 2008లో ఈ న్యూస్ పేపర్ సేవలు నిలిచిపోయాయి. కానీ, 2016 నుంచి డిజిటల్ పబ్లికేషన్ ప్రారంభమైంది.

నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటీ?

రూ. 2000 కోట్ల విలువలైన అసెట్స్‌ ఈక్విటీ ట్రాన్సాక్షన్‌లో అవకతవకలకు సంబంధించినదే ఈ కేసు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలుదఫాలుగా సొమ్ము అందించింది. సుమారు రూ. 90 కోట్లు అందించినా 2008లో ఈ పత్రిక మూతపడక తప్పలేదు.

అయితే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపితమైంది. ఈ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 2010లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ను టేకోవర్ చేసుకుంది. అనంతరం బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ వ్యవహారంపై ఆరోపణలు సంధించారు. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ మోసపూరితంగా అధీనం చేసుకుందని కంప్లైంట్ చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, పొలిటికల్ సంస్థ థర్డ్ పార్టీతో ఆర్థిక లావాదేవీలు జరపరాదు.

అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కువ మొత్తంలో లాభంతోనే సొంతం చేసుకున్నారని స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కాంగ్రెస్‌కు బాకీపడ్డ సుమారు రూ. 89.5 కోట్లు రద్దు అయినట్టు స్వామి ఆరోపించారు. తద్వార ఆ సొమ్ము అంతా వీరు పొందారని (మనీలాండరింగ్?) సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేశారు.

click me!