టీఆర్ఎస్ కు ఈసీ షాక్

By Nagaraju TFirst Published Oct 3, 2018, 8:18 PM IST
Highlights

టీఆర్ఎస్‌కు ఈసీ షాకిచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీకి అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బతుకమ్మ చీరలు పంపిణీ చేయోద్దని సిఈసీ ఆదేశించింది. ఈనెల 9న తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరగనున్నాయి. 


 

హైదరాబాద్: టీఆర్ఎస్‌కు ఈసీ షాకిచ్చింది. బతుకమ్మ చీరల పంపిణీకి అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బతుకమ్మ చీరలు పంపిణీ చేయోద్దని సిఈసీ ఆదేశించింది. ఈనెల 9న తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరగనున్నాయి. 

పండుగ లోగా కోటి చీరల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 280 కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం కోటి చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే 50 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. అయితే ఈసీ మోకాలడ్డటంతో చీరల పంపిణీకి బ్రేక్ పడినట్లయింది. చేనేత కార్మికుల దగ్గర నుంచి దాదాపు కోటి చీరలను 12 రంగుల్లో చీరలను తయారు చేయించింది ప్రభుత్వం.

మరోవైపు ప్రభుత్వం చేనేత కార్మికుల నుంచి తయారు చేయించిన కోటి చీరలను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఈసీ అడ్డు చెప్పడంతో చీరల పంపిణీ మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

మరోవైపు సిఈసీ నిర్ణయం రైతుబంధు చెక్కుల పంపిణీకి కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉంది. నవంబర్ నెలలో రైతులకు రైతు బంధు చెక్కులు పంపిణీ చెయ్యాలని నిర్ణయించింది. దాదాపు 50 లక్షల మంది రైతులకు రూ.4వేలు చొప్పున 6కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే చెక్కుల తయారీకి బ్యాంకులకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

వాస్తవానికి అక్టోబర్ నెలలోనే రైతు బంధు చెక్కులను పంపిణీ చెయ్యాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టులో కేసులు వెయ్యడంతో అది ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. దీంతో నవబర్ నెలలో చెక్కులు ఇవ్వాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే బతుకమ్మ చీరల పంపిణీకి సిఈసీ అడ్డు చెప్పడంతో రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎలాంటి అడ్డంకిలు సృష్టిస్తోందనని టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.   

click me!