గంటన్నర దాటింది..అయినా ప్రారంభం కాని పోలింగ్

Published : Dec 07, 2018, 08:48 AM ISTUpdated : Dec 07, 2018, 08:51 AM IST
గంటన్నర దాటింది..అయినా ప్రారంభం కాని పోలింగ్

సారాంశం

తెలంగాణ పోలింగ్ ప్రారంభమై గంటన్నర దాటినా ఇంకా అనేక చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎం, వీవీ ప్యాట్ లలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. 

హైదరాబాద్: తెలంగాణ పోలింగ్ ప్రారంభమై గంటన్నర దాటినా ఇంకా అనేక చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎం, వీవీ ప్యాట్ లలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. 

ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల, గాండ్లగూడెం, చర్ల, రంగరాజపురం, భద్రాచలంలో ఈవీఎంలు మొరాయించాయి. అలాగే నల్గొండ జిల్లా దామరచర్ల లోనూ, మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం, రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట, కామారెడ్డి, జుక్కల్, డొంగ్లీ, వేములవాడ, సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు, గరిడేపల్లి, శేరిలింగంపల్లి వివేకానందనగర్‌, హయత్‌నగర్‌ బూత్‌ నెం-200లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. 

దీంతో ఓటర్లు అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన అనేకమంది ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఈవీఎంలు మెరాయించడంతో గంటదాటిన పనిచెయ్యకపోవడంతో వృద్ధులు ఇంటిముఖం పడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

KTR Pressmeet: తుగ్లక్ పరిపాలన చూస్తున్నాం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu
Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?