
తాజాగా డ్రగ్ కేసులో జరుగుతున్న పరిణామాలను గతంలో ఏనాడు లేని విధంగా విచారణ జరుగుతుంది. ఇందులో ప్రధాన నిందుతులకు నోటీసులు ఇచ్చిన విషయం జరిగింది. వారిని స్పెషల్ టీం దర్యాప్తు కొనసాగుతుంది.ఎక్సైజ్ అధికారులు అయినా ఆర్వీ చంద్రవదన్, అకున్ సబర్వాల్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా తో మాట్లాడిన చంద్రవదన్ ఈ కేసును అకున్ సబర్వాల్ అద్వర్యంలో విజయవంతంగా నడుస్తుందని. గతంలో ఏనాడు లేని విధంగా డ్రగ్స్ ముఠా వివరాలు బయటికి వస్తున్నాయని ఆయన తెలిపారు.
డ్రగ్స్ కేసులో కొందరు సిట్ టీ పక్షపాత దోరణిలో నడుస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. మాకు ప్రతి ఒక్కరు సమానమే. మేము ఎవ్వరిని టార్గేట్ చేయ్యడం లేదని సిట్ టీం పై విమర్శలు తగదన్నారు. స్పెషల్ టీం గతం లో కన్న లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని. సిఎం కేసిఆర్ ఆదేశాల మేరకు కేసును విచారిస్తున్నామని తెలిపారు.
ఇక చిన్నపిల్లల విషయంలో వారిని కూడా గంటల తరబడి విచారిస్తారా... అని ప్రశ్నించడం తగదన్నారు. కావాలనే మా విచారణను కొందరు వక్రికరిస్తున్నారన్నారు. డ్రగ్స్ కేసు చాలా సున్నితమైందని హై కోర్టు గైడ్ లైన్‌ల ఉన్నాయని వాటి ప్రకారం కేసులో ముందుకేళ్లుతామని ఆయన తెలిపారు.