కేసీఆర్ తాగిన పాలు: గుట్టు విప్పిన మంత్రి ఈటెల రాజేందర్

By telugu teamFirst Published Dec 23, 2019, 8:33 AM IST
Highlights

తెలంగాణ సిఎం కేసీఆర్ బాల్యంలో తాగిన పాల గురించి మంత్రి ఈటెల రాజేందర్ ముదిరాజ్ ల సమారాధన కార్యక్రమంలో చెప్పారు.అందుకే కేసీఆర్ ముదిరాజ్ ల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.

ఖమ్మం: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురించి తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అత్యంత రహస్యమైన విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్ ముదిరాజ్ ల పాలు తాగి పెరిగారని ఆయన అన్నారు. 

కేసీఆర్ మాతృమూర్తికి 12 మంది సంతానం కావంతో పాలు సరిపడా లేని సమయంలో పొరుగున ఎంతో ప్రేమపూరితంగా ఉండే ముజిరాజ్ తల్లి పాలను కేసీఆర్ తాగారని ఆయన అన్నారు. ముదిరాజ్ కులస్థులకు, కేసీఆర్ కు మధ్య ఉన్న అనుబందం ఇదీ అని ఆయన చెప్పారు.

ఆ ప్రేమతోనే కేసీఆర్ మన కులస్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్డులోని ఓ మామిడితోటలో ఆదివారం ముదిరాజ్ ల వన సమారాధాన జరిగింది. 

ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావుతో పాటు మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ముదిరాజ్ ల సాధక బాధకాలు తెలుసు కాబట్టే వారి అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఈటల అన్నారు.

click me!