నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి ఈటల రాజీనామా.. కేటీఆర్‌కే ఆ పోస్ట్, ఫిక్స్!

By Siva KodatiFirst Published Jun 15, 2021, 11:20 PM IST
Highlights

భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరో కీలక పదవికి రాజీనామా చేశారు. ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఎగ్జిబిషన్‌ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. 

భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మరో కీలక పదవికి రాజీనామా చేశారు. ప్రతిష్టాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఎగ్జిబిషన్‌ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు.

దీంతో సొసైటీ పాలకమండలి సభ్యులు సమావేశమై ఈటల రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. అయితే త్వరలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవిని మంత్రి కేటీఆర్‌కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్లుగా తెలుస్తోంది. 81 ఏళ్ల హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ చరిత్రలో పదవీకాలం మధ్యలో ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈటల స్థానంలో మంత్రి కేటీఆర్‌ను అధ్యక్షునిగా నియమించాలని మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:కేసీఆర్ పక్కనే వుంటూ... సీఎం కుర్చీ కోసం ఈటల కుట్రలు: మంత్రి గంగుల సంచలనం

మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ తొలగించడంతో ఈటల ఆ వెంటనే ఎమ్మెల్యే పదవి‌తోపాటు టీఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న  వెంటనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.
 

click me!