తెలంగాణ: ముగిసిన వేసవి సెలవులు.. పాఠశాలల ప్రారంభంపై లేని స్పష్టత, కన్‌ఫ్యూజన్‌లో టీచర్స్

By Siva KodatiFirst Published Jun 15, 2021, 7:13 PM IST
Highlights

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దీంతో రేపటి నుంచి బడులు తెరచుకోవాలి. కానీ కరోనా కారణంగా స్కూల్స్ తెరచుకోవడం లేదు. ఆన్‌లైన్ క్లాసులపైనా క్లారిటీ లేదు. ఉపాధ్యాయులు సైతం బడులకు రావాలా వద్దా, స్పష్టత కూడా విద్యాశాఖ నుంచి లేకుండా పోయింది.

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దీంతో రేపటి నుంచి బడులు తెరచుకోవాలి. కానీ కరోనా కారణంగా స్కూల్స్ తెరచుకోవడం లేదు. ఆన్‌లైన్ క్లాసులపైనా క్లారిటీ లేదు. ఉపాధ్యాయులు సైతం బడులకు రావాలా వద్దా, స్పష్టత కూడా విద్యాశాఖ నుంచి లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. బడులకు వెళ్లాలో వద్దో తెలియక టీచర్లు కన్‌ఫ్యూజన్‌లో వున్నారు. 

Also Read:టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్: అందరినీ పాస్ చేసిన సబితా ఇంద్రారెడ్డి

మరోవైపు తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మార్కుల కేటాయింపుపై త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కమిటీ సిఫారసుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని ఆమె వెల్లడించారు. కరోనా పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు భవిష్యత్, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు రాయాలనుకునేవారు కోవిడ్ అదుపులోకి వచ్చిన తర్వాత రాయొచ్చని మంత్రి వెల్లడించారు. 

click me!