తెలంగాణలో అదుపులోనే కరోనా: కొత్తగా 1556 కేసులు.. జీహెచ్ఎంసీలో తీవ్రత

Siva Kodati |  
Published : Jun 15, 2021, 09:25 PM IST
తెలంగాణలో అదుపులోనే కరోనా: కొత్తగా 1556 కేసులు.. జీహెచ్ఎంసీలో తీవ్రత

సారాంశం

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,06,436కు పెరిగింది

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1556 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,06,436కు పెరిగింది. కరోనాతో ఒక్కరోజు వ్యవధిలో 14 మరణాలు చోటుచేసుకోగా.. మొత్తం మరణాల సంఖ్య 3510గా ఉంది. ఇక మహమ్మారి నుంచి కొత్తగా 2070 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 5,82,993గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,043 మంది కరోనా సాంపిల్స్‌ను పరీక్షించామని.. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం టెస్టుల సంఖ్య 1,69,54,634కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 114, జీహెచ్ఎంసీ 182, జగిత్యాల 26, జనగామ 21, జయశంకర్ భూపాలపల్లి 24, గద్వాల 19, కామారెడ్డి 8, కరీంనగర్ 88, ఖమ్మం 131, మహబూబ్‌నగర్ 28, ఆసిఫాబాద్ 9, మహబూబాబాద్ 54, మంచిర్యాల 38, మెదక్ 15, మేడ్చల్ మల్కాజిగిరి 91, ములుగు 29, నాగర్ కర్నూల్ 20, నల్గగొండ 135, నారాయణపేట 16, నిర్మల్ 3, నిజామాబాద్ 18, పెద్దపల్లి 70, సిరిసిల్ల 35, రంగారెడ్డి 90, సిద్దిపేట 33, సంగారెడ్డి 21, సూర్యాపేట 77, వికారాబాద్ 22, వనపర్తి 25, వరంగల్ రూరల్ 21, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరిలో 33 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 

PREV
click me!

Recommended Stories

పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్