గణతంత్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన: ఈటల రాజేందర్ ఫైర్

Published : Jan 26, 2022, 03:37 PM ISTUpdated : Jan 26, 2022, 03:39 PM IST
గణతంత్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘన: ఈటల రాజేందర్ ఫైర్

సారాంశం

గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున తెలంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకులకు హాజరు కాలేదని ఆరోపించారు.

గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున తెలంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకులకు హాజరు కాలేదని ఆరోపించారు. బుధవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనకుండా కేసీఆర్ రాజ్యాంగం, సంప్రదాయాలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కనీసం సీనియర్ మంత్రి కూడా లేకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం అని ఈటల అభిప్రాయపడ్డారు.

గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు.. కానీ గవర్నర్ కుర్చీకి గౌరవం ఇవ్వాలని ఈటల అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ కుర్చీకే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ హోదాలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ శ్రేణులు అసహనంతోనే దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుంటే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
తెలంగాణ రాజ్‌భవన్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను (Republic Day Celebration) నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ (Tamilisai Soundararajan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గవర్నర్.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu