కరీంనగర్‌లో బావిలో పడ్డ కారు: ఐదుగురు గల్లంతు, గాలింపు (వీడియో)

Published : Jul 29, 2021, 11:45 AM ISTUpdated : Jul 29, 2021, 03:08 PM IST
కరీంనగర్‌లో బావిలో పడ్డ కారు: ఐదుగురు గల్లంతు, గాలింపు (వీడియో)

సారాంశం

కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో  బావిలో కారు పడిపోవడంతో కారులోని నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరులో గురువారం నాడు ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. కారులోని నలుగురు గల్లంతయ్యారు.కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా కారు చిన్నముల్కనూరు వద్ద బావిలో పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలను  చేపట్టారు. 

అతి వేగంగా వచ్చి బావిలో పడింది. గజ ఈతగాళ్లు, రెస్క్యూ  సిబ్బందితో బావిలో పడిన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కారు అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని ప్రత్యక్షసాక్షి తెలిపారు. తన  కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బావిలో పడిందని ప్రత్యక్షసాక్షి తెలిపారు. ఐదు నిమిషాలల్లోనే కారు బావిలో పూర్తిగా మునిగిపోయిందని ఆయన  చెప్పారు.

 

వీడియో

చినముల్కనూరు శివారులోని ఓ వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. బావిలో పూర్తిగా కారు మునిగిపోయింది. అయితే వ్యవసాయ క్షేత్రానికి పని మీద వెళ్లిన రైతు మోటార్ ఆన్​ చేద్దామని బావివద్దకు వెళ్లి చూడగా నీటిలో ఏదో మునిగినట్లు కనిపించింది. వెంటనే ఇరుగుపొరుగు పొలాల్లో ఉన్న వారిని పిలవగా వారంతా వచ్చి బావిలో కారు ఉన్నట్లు గుర్తించారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాహనంలో దాదాపు ఐదుగురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా జరిగినట్లు తెలిపారు

PREV
click me!

Recommended Stories

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే