
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భార్య పుష్పారెడ్డి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని ప్రజా కవి, గాయకుడు ఏపూరి సోమన్న డిమాండ్ చేశారు.
పోలీసు స్టేషన్ లో ఆమె తనను కులం పేరుతో ధూషించిందని ఆరోపించారు. ఈమేరకు తిరుమలగిరి ఎస్సై కి ఫిర్యాదు చేశారు సోమన్న.
ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలేమంటే... తాను, తన భార్య మధ్య గొడవ జరగగా పోలీసులు తనను పిలిపించి మాట్లాడుతున్న సందర్భంలో కుంట పుష్పారెడ్డి స్టేషన్ కు వచ్చి కులం పేరుతో ధూషించిందని ఆరోపించారు. ఆమెతోపాటు ఆమె అనుచరులు బెదిరించారని తెలిపారు.
ఎమ్మెల్యే సతీమణి కుంట పుష్పారెడ్డి, ఆమె అనుచరల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. తక్షణమే తనకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు.
మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి