అత్యంత అరుదైన అలెగ్జాండ్రియన్ జాతి రామచిలుకలు స్వాధీనం

By Siva KodatiFirst Published Jan 18, 2023, 8:43 PM IST
Highlights

విక్రయించేందుకు తీసుకెళ్తున్న అత్యంత అరుదైన అలెగ్జాండ్రియన్ జాతి రామచిలుకలను తెలంగాణ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చిలుకలు నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు . 

అత్యంత అరుదైన అలెగ్జాండ్రియన్ జాతి రామచిలుకలను తెలంగాణ అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పది రామచిలుకలను బైక్‌పై తరలిస్తుండగా బుధవారం అధికారులు ఆరామ్‌ఘర్ వద్ద పట్టుకున్నారు. వీటిని షాద్ నగర్ నుంచి తరలిస్తుండగా తెలుస్తోంది. వీటిని తరలిస్తున్న వారిపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. నిందితులను అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్‌లుగా గుర్తించారు. వీటిని రూ.25 వేలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఇలాంటి నేరానికి గాను మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధిస్తారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న చిలుకలు నెహ్రూ జూ పార్క్‌కు తరలించారు . 

click me!