టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు: విచారణకు రావాలని ఆదేశం

By narsimha lode  |  First Published Nov 16, 2022, 5:03 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఈడీ నోటీసులు జారీ చేసింది.విచారణకు రావాలని కోరింది.రమణతో పాటు మెదక్ డీసీసీబీ  చైర్మెన్ దేవేందర్ రెడ్డిలను కూడా విచారణకు రావాలని ఈడీ కోరింది.


హైదరాబాద్:టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ,మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డి లకు ఈడీ నోటీసులుజారీ చేసింది.హవాలా,ఫెమా ఉల్లంఘనలపై  ఈడీ విచారణ జరుపుతుంది.ఇప్పటికే పలుమార్లు చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది.రేపు,ఎల్లుండి విచారణకుహజరుకావాలనిఈడీ నోటీసులు జారీ చేసింది.క్యాసినో వ్యవహరింలో ఈడీ  నోటీసులు ఇచ్చింది.హవాలా,ఫెమా ఉల్లంఘనల కేసులో  ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే తలసాని ధర్మేంద్రయాదవ్ ,మహేష్ యాదవ్ లను ఇవాళ ఈడీ విచారించింది.తాజాగా ఎల్.రమణ,దేవేందర్ రెడ్డిలకు కూడానోటీసులు జారీ చేసిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.క్యాసినో వ్యవహారానికి సంబంధించి చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారిస్తుంది.ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభించింది. ప్రవీణ్ కుమార్ తో సంబంధాలున్న పలువురిని ఈడీ విచారిస్తుంది.

చీకోటి ప్రవీణ్ ను  ఆగస్టు   మాసంలో ఈడీ  అధికారులు  విచారించారు.  క్యాసినో పై ఎక్కడైతే నిషేధం  లేదో  అక్కడ క్యాసినో  ఆడించినట్టుగా  ప్రవీణ్  కుమార్  బహిరంగంగానే  చెప్పారు.  క్యాసినో  ఆడించడంలో తాను నిబంధనలు  ఉల్లంఘించలేదన్నారు. గోవా సహ ఎక్కడైతే  క్యాసినోపై నిషేధం  లేదో  అక్కడే  తాను  కేసినో  ఆడించిన  విషయాన్ని  ప్రవీణ్ కుమార్  మీడియా  ముందు ఒప్పుకున్నారు. విదేశాల్లో కూడా ప్రవీణ్  కుమార్  కొందరిని  తీసుకెళ్లి  కేసినో  ఆడించారని  ఈడీ  అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారని అప్పట్లో  మీడియాలో కథనాలు  వెలువడ్డాయి.

Latest Videos

also  readక్యాసినో కేసులో వేగం పెంచిన ఈడీ.. విచారణకు హాజరైన తలసాని మహేష్, ధర్మేంద్ర

రెండు  తెలుగు రాష్ట్రాల నుండి  సుమారు  వెయ్యి మందిని  ప్రవీణ్  విదేశాలకు  తీసుకెళ్లి  కేసినో  ఆడించారని  ఆ  కథనాలు తెలిపాయి.  అయితే  ఈ విషయాలపై  తాను  ఈడీ  ప్రశ్నలకు  సమాధానాలు  చెప్పినట్టుగా  ప్రవీణ్ కుమార్  వివరించారు. మళ్లీ  ఎప్పుడు  పిలిచినా కూడా  తాను  ఈడీ విచారణకు హాజరుకానున్నట్టుగా  ప్రవీణ్  కుమార్ వివరించారు.  తాజాగా కేసీనో  వ్యవహరంలో  ప్రవీణ్  తో  సంబంధాలున్నవారిని  ఈడీ  విచారిస్తుంది. 

click me!