అభద్రతాభావంతోనే కేసీఆర్ వ్యాఖ్యలు:కాంగ్రెస్ నేత మల్లు రవి

By narsimha lode  |  First Published Nov 16, 2022, 4:14 PM IST

కేసీఆర్ అభద్రతాభావంతో  మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి చెప్పారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను చేర్చుకొన్న కేసీఆర్ ను ఏమనాలో చెప్పాలన్నారు.
 


హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారని  కాంగ్రెస్ నేత మల్లు రవి చెప్పారు. బుధవారంనాడు హైద్రాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.మీపై నిఘా ఉందని ఎమ్మెల్యేలను కేసీఆర్ భయపెడుతున్నారన్నారు. తన పోన్ ట్యాపింగ్ జరిగిందని గవర్నర్ అంటే నమ్మలేదన్నారు.కానీ నిన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూస్తే అనుమానాలు వస్తున్నాయన్నారు. పార్టీ మారాలని బీజేపీ నేతలు అడిగితే  చెప్పుతో కొట్టాలని కేసీఆర్ చెబుతున్నారన్నారు.కానీ  తమ పార్టీకి చెందిన 12 మంది  ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకొన్న కేసీఆర్ ను ఏమనాలో చెప్పాలన్నారు. 

ఈ నెల 15న హైద్రాబాద్ లో టీఆర్ఎస్ శాసనసభపక్షంతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కవితను కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఇంతకన్న ఘోరం  ఉంటుందా అన్నారు. పార్టీలు మారాలని బీజేపీ ఏ రకంగా ఒత్తిడి తెస్తుందో ఈ ఒక్క ఘటన రుజువు చేస్తుందన్నారు.బీజేపీ తీరుపై  పోరాటం చేయాల్సిందేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో సోదాలు  చేసేందుకు వస్తే ధర్నాలు చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని కేసీఆర్ కోరారు.

Latest Videos

also read:స్వంత ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు:కేసీఆర్‌పై బూర నర్సయ్య గౌడ్

పార్టీ మారాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఇవాళ  స్పందించారు. కవితే కాదుటీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నా తాము ఒప్పుకోమని ఆ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లో కేసీఆర్ చేర్చుకున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
 

click me!