న్యాయవాదుల సూచన మేరకు నడుచుకొంటాం: ఈడీ విచారణ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 27, 2022, 12:59 PM IST
Highlights

ఈడీ విచారణకు గైర్హాజరైన  విషయమై  తాండూరు ఎమ్మెల్యే   పైలెల్ రోహిత్ రెడ్డి  వివరణ ఇచ్చారు.   ఈ కేసు ఈడీ పరిధిలోకి రాదని  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసినట్టుగా  రోహిత్ రెడ్డి  చెప్పారు.

హైదరాబాద్: తన న్యాయవాదుల  సలహా మేరకు తాను  ఈడీ విచారణకు వెళ్లే విషయమై నిర్ణయం  తీసుకుంటానని  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంగళవారంనాడు హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు.  ఇవాళ  విచారణకు హాజరు  కావాలని ఈడీ అధికారులు  రోహిత్ రెడ్డిని ఆదేశించారు. అయితే  మధ్యాహ్నం వరకు  ఆయన  తన నివాసంలోనే  ఉన్నారు. ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈ విషయమై  ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును ఈడీ విచారణ చేయడాన్ని సవాల్  చేస్తూ  తాను  నిన్ననే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా  చెప్పారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు రేపు విచారించే అవకాశం ఉందన్నారు రోహిత్ రెడ్డి. ఈడీ అధికారుల విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయమై   న్యాయవాదులతో  చర్చించనున్నట్టుగా రోహిత్ రెడ్డి ప్రకటించారు. తమ న్యాయవాదులు ఎలా సూచిస్తే  అలా నడుచుకొంటానని రోహిత్ రెడ్డి  చెప్పారు. ఈడీ అధికారులు ఏమైనా డాక్యుమెంట్లు అడిగితే  వాటిని సమర్పించనున్నట్టుగా  చెప్పారు.ఈ నెల  16వ తేదీన  విచారణకు రావాలని ఈడీ అధికారులు  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.ఈ నెకల  19, 20 తేదీల్లో  ఈడీ అధికారులు  విచారణ నిర్వహించారు. ఇవాళ కూడా విచారణకు రావాలని  ఆదేశించారు. కానీ ఈడీ అధికారుల విచారణకు పైలెట్ రోహిత్ రెడ్డి హాజరు కాలేదు.  

also read:విచారణకు హాజరు కాలేను: ఈడీకి మెయిల్ పంపిన పైలెట్ రోహిత్ రెడ్డి

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును ఈడీ విచారణ చేయడాన్ని రోహిత్ రెడ్డి సవాల్  చేశారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో  రిట్  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్  కు ఇవాళ నెంబర్ కేటాయించనున్నారు. రేపు  విచారణకు వచ్చే అవకాశం ఉంది. మనీలాండరింగ్  జరిగితేనే  ఈడీ విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని  రోహిత్ రెడ్డి  చెప్పారు.  ఎమ్మెల్యేల కొనుగోలులో  ఈడీ విచారణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏదో రకంగా  తనను కేసులో  ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని  రోహిత్ రెడ్డి  రెండు  రోజుల క్రితం అనుమానం వ్యక్తం  చేశారు.. అందుకే  నందకుమార్ ను  ఈడీ అధికారులు విచారిస్తున్నారని  రోహిత్ రెడ్డి  ఆరోపించారు.  ఇదిలా ఉంటే  ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణకు ఆదేశిస్తూ  తెలంగాణ హైకోర్టు  నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

click me!