లోన్ యాప్ కేసు: ఈడీ దర్యాప్తు వేగవంతం.. మరో 238 కోట్ల ఆస్తుల జప్తు

By Siva KodatiFirst Published Sep 30, 2021, 6:09 PM IST
Highlights

లోన్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లి.కి చెందిన మరో రూ.238 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ జప్తు చేసింది. గతంంలో పీఎస్ఎఫ్ఎస్‌కు చెందిన రూ.106 కోట్లు సీజ్ చేసింది ఈడీ. సరకు దిగుమతి పేరుతో రూ.429 కోట్ల నగదును విదేశాలకు తరలించినట్లుగా గుర్తించారు.

లోన్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లి.కి చెందిన మరో రూ.238 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ జప్తు చేసింది. గతంంలో పీఎస్ఎఫ్ఎస్‌కు చెందిన రూ.106 కోట్లు సీజ్ చేసింది ఈడీ. సరకు దిగుమతి పేరుతో రూ.429 కోట్ల నగదును విదేశాలకు తరలించినట్లుగా గుర్తించారు. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చింది పీసీఎఫ్ఎస్. చైనాకు చెందిన జో యాహూయ్ ఆధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ ఆరోపిస్తోంది. బోగస్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్లుగా ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేస్తున్నట్లు తెలిపింది. 
 

click me!