Election Code: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోడింది. మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని వెల్లడించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. దీంతో తెలంగాణలో ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వచ్చింది.
Election Code: అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. తో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో నగదు, బంగారం ఇతర విలువైన వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం.. ఒక్క వ్యక్తి కేవలం రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు వీలు ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం, విలువైన వస్తువులు తీసుకెళ్లాలంటే.. పోలీసులకు లేదా తనిఖీ అధికారులకు సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే.. వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే.. పక్క ఆధారాలు చూపించి.. వాటిని వెనక్కి తిరిగి తీసుకునే అవకాశం ఉంది.
కాబట్టి.. ఈ ఎన్నికల సమయంలో వైద్యం, ఫీజులు, వ్యాపార కార్యకలపాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించే వారు అధిక మొత్తంలో నగదును తీసుకెళ్తే.. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో బంగారం, ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లినా ఇబ్బంది తప్పదు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరైన ఆధారాలు లేని డబ్బు దొరికితే సీజ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా భద్రతా కట్టుదిట్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం 148 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.