కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థికి ఈసీ నోటీసులు: దొరికిన డబ్బుకి వివరాలివ్వాలని ఆదేశం

Published : Nov 29, 2018, 07:53 PM IST
కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థికి ఈసీ నోటీసులు: దొరికిన డబ్బుకి వివరాలివ్వాలని ఆదేశం

సారాంశం

కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. బుధవారం దొరికిన నగదుకు వివరాలు చెప్పాలని ఆదేశించింది. బుధవారం పట్నం నరేందర్ రెడ్డి బంధువు ఫాం హౌస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

హైదరాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. బుధవారం దొరికిన నగదుకు వివరాలు చెప్పాలని ఆదేశించింది. బుధవారం పట్నం నరేందర్ రెడ్డి బంధువు ఫాం హౌస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

ఈ సోదాల్లో రూ.51 లక్షలు నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని ఈసీ నరేందర్ రెడ్డికి ఆదేశించింది. రూ.50వేలు వరకు వివరాలు అవసరం లేదని దాటితే వివరాలు చూపించాలని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. ఒక వేళ వివరాలు చూపించకపోతే నగదును సీజ్ చేస్తామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

తోటి ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఉద‌య్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్టులు
Revanth Reddy: హైడ్రా విష‌యంలో అస్స‌లు త‌గ్గేదేలే లేదు.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు