తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో ఈ పార్టీకి గుర్తింపు లేనందున గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేయలేదు. గ్లాస్ సింబల్‌ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీంతో జనసేన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులగా పోటీకి దిగుతారా? అనే చర్చ మొదలైంది.
హైదరాబాద్: జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీతో పొత్తులో బరిలోకి దిగుతున్నది. 111 సీట్లల్లో బీజేపీ పోటీ చేయగా.. ఎనిమిది సీట్లల్లో జనసేన పోటీకి దిగనుంది. అయితే.. జనసేనకు తెలంగాణలో గుర్తింపు లేదు. దీంతో జనసేన ప్రచారం చేసుకునే టీ గ్లాసు గుర్తు తెలంగాణలో వర్తించకపోవచ్చనే చర్చ మొదలైంది. జనసేన పార్టీకి తెలంగాణలో గుర్తింపు లేకపోవడంతో టీ గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేదు. దీంతో జనసేన, బీజేపీలు షాక్‌కు గురవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పార్టీకి ఎన్నికల సంఘం టీ గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయకపోవడంతో పార్టీలో గందరగోళం రేగింది. ఇక్కడ జనసేన పార్టీకి గుర్తింపు లేకపోవడంతో టీ గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. దీంతో ఫ్రీ సింబల్స్ జాబితాలో టీ గ్లాస్ గుర్తు చేరిపోయింది. దీంతో జనసేన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
అన్ని స్థానాల్లో ఫ్రీ సింబల్స్ అందుబాటులో ఉంటాయి. అయితే.. ఫ్రీ సింబల్స్‌లో నచ్చిన గుర్తు కోసం విజ్ఞప్తి చేసిన వారికి ఆ గుర్తు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఎనిమిది మంది జనసేన అభ్యర్థులకు టీ గ్లాస్ సింబల్ దక్కుతదా? అనే సంశయాలు ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల గుర్తు కేటాయింపులు జరుగుతాయి. ఉపసంహరణ తర్వాత ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.
Also Read: Telangana: చివరి జాబితాలోనూ విజయశాంతికి చోటులేదు.. అసెంబ్లీ బరిలో లేనట్టే
దీంతో జనసేన శ్రేణులతోపాటు బీజేపీలోనూ కలకలం రేగింది. ఇంతమాత్రం దానికే జనసేనతో పొత్తు అవసరమా? అని పార్టీ వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయి. కూకట్‌పల్లి వంటి ముఖ్యమైన స్థానాలను బీజేపీ.. జనసేకు వదిలిపెట్టిందని, ఇప్పుడు జనసేన అభ్యర్థులు టీ గ్లాస్ కాకుండా వేరే గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులగా పోటీ చేయాల్సిన స్థితి ఏర్పడిందని ఆగ్రహంలో ఉన్నారు. బీజేపీ కోసం నిరంతరం శ్రమించిన వారిని వదిలిపెట్టి ఆ స్థానాలను జనసేనకు కేటాయించడంపై సీరియస్ అవుతున్నారు.