సికింద్రాబాద్ రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదంపై విద్యుత్, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి చెప్పారు. తొలుత లాడ్జీ దిగువన ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగిందని ఆమె తెలిపారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి చెప్పారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతుందని ఆమె తెలిపారు.
మంగళవారం నాడు సికింద్రాబాద్ లోని రూబీ లాడ్జీ వద్ద చందనా దీప్తి మీడియాతో మాట్లాడారు. సోమవారం నాడు రాత్రి 9:30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే తమ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని ఆమె వివరించారు. ఈ ఘటనలో మరణించిన ఎనిమిది మందిలో నలుగురిని గుర్తించామన్నారు ఇద్దరు తమిళనాడు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించామని చందనా దీప్తి చెప్పారు.ఆసుపత్రిలో మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చందనా దీప్తి తెలిపారు. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో తొలుత మంటలు వ్యాపించాయన్నారు.
undefined
also read:సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఏడుగురి మృతి.. పదిమందికి గాయాలు..
అయితే మంటలు వ్యాపించడానికి చోటు చేసుకున్న కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగలు వ్యాపించడంతో సహయక చర్యలు చేపట్టేందుకు కూడ ఆటంకం ఏర్పడిందని ఆమె తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు భవనం పై నుండి కిందకు దూకారని డీసీపీ తెలిపారు.ఈ ఘటనకు గల కారణాలపై విద్యుత్, అగ్ని మాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల నుండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని చందనా దీప్తి తెలిపారు.ఈ ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లో ర్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లన్నీ కూడా అగ్నికి ఆముతయ్యాయయని చందనా దీప్తి చెప్పారు.
సోమవారం నాడు రాత్రి సికింద్రాబాద్ లోని లాడ్జిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రమాదానికి లాడ్జీ కింద భాగంలో ఉన్నఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో బ్యాటరీ పేలుడే కారణమా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.