ఈనాడు అధినేత రామోజీ రావు ఆరోగ్యం విష‌మం.. వెంటిలేటర్‌పై చికిత్స

By Mahesh RajamoniFirst Published Jun 7, 2024, 11:56 PM IST
Highlights

Ramoji Rao :రామోజీరావు కొంతకాలంగా వృద్ధాప్యం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వయసు 87 సంవత్సరాలు. 
 

Eenadu founder Ramoji Rao : ఈనాడు అధినేత రామోజీ రావు ఆరోగ్య ప‌రిస్థితి విషమంగా ఉంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఇటీవల రామోజీరావుకు స్టెంట్ హార్ట్ సర్జరీ జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థితకు గురికావ‌డంతో ఆయ‌న‌ను నానక్ రామ్ గూడ లోని స్టార్ హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం వెంటిలేటర్ పై వైద్య చికిత్సలు అందిస్తున్న వైద్యులు తెలిపారు. రామోజీ ఆరోగ్య ప‌రిస్థితి ఇంకా విష‌మంగానే  ఉంద‌ని స‌మాచారం. వయస్సు రీత్య పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రామోజీరావు.. మరికొన్ని గంటలు గడిస్తే గాని ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఏమీ చెప్పలేమ‌ని వైద్యులు పేర్కొంటున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే రామోజీ హెల్త్ బులిటెన్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. 

Latest Videos

కాగా, రామోజీ రావు అనారోగ్య ప‌రిస్తితిపై కుటుంబ స‌భ్యులు, ఆయ‌న‌ అభిమానులు, సంస్థ సిబ్బంది ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం రామోజీ హెల్త్ బులిటెన్ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. 

'ఇది యుద్ధం కాదు బాసు'.. భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ పై హార్దిక్ పాండ్యా ఏమ‌న్నాడంటే..?

click me!