ఢిల్లీ లిక్కర్ స్కాం:శరత్ చంద్రారెడ్డి,వినయ్ బాబులను కస్టడీ కోరిన ఈడీ

By narsimha lode  |  First Published Nov 10, 2022, 5:54 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను  ఈడీ అధికారులు కోర్టులో హజరుపర్చారు. 
 


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి,వినయ్ బాబులను ఈడీ అధికారులు గురువారంనాడు మధ్యాహ్నం  కోర్టులో హాజరుపర్చారు. శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఈడీ అధికారులు  ఈ ఇద్దరిని ఢిల్లీలో ప్రశ్నించారు.ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. వీరిద్దరిని 14 రోజుల కస్టడీ  కోరుతూ ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ను ఎఫ్ఐఆర్ లో సీబీఐ చేర్చింది. ఈ కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ మాసం చివర్లో శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో  ఈడీ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన సోదాలతో పాటు  గతంలో అరెస్టైన వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ  అధికారులు విచారణ చేస్తున్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ ,అక్టోబర్ మాసాల్లో ఈడీ అధికారులు తెలంగాణ,ఏపీ రాష్ట్రాల్లో పలు దఫాలు సోదాలు నిర్వహించారు.  ఈ కేసులో హైద్రాబాద్ కు  చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై సీబీఐ ఎఫ్ఐఆర్ ను  నమోదు చేసింది. ఈ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ అనుమానిస్తుంది. దీంతో ఈడీ అధికారులు సోదాలుచేశారు. హైద్రాబాద్ లోని గోరంట్ల అసోసియేట్స్ లో ఈడీ అధికారులు సోదాలు  చేసిన సమయంలో కీలక సమాచారాన్నిసేకరించారు. 

Latest Videos

undefined

alsoread:ఢిల్లీ లిక్కర్ స్కాం‌లో ఈడీ దూకుడు: ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ రెడ్డి ‌, వినయ్ అరెస్ట్

ఈ సమాచారం ఆధారంగా ఈడీ విచారణ నిర్వహించింది. తెలంగాణకు  చెందిన బోయినపల్లి అభిషేక్ రావును ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇవాళ శరత్ చంద్రారెడి,వినయ్ బాబులను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటీఆర్ఎస్  నేతలకు  సంబంధాలున్నాయని కూడా బీజేపీ ఆరోపించింది.ఈ ఆరోపణలను  టీఆర్ఎస్ ఖండించింది.
 

click me!