షాక్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఈడీ కొరడా

By telugu teamFirst Published Jul 2, 2020, 9:18 AM IST
Highlights

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఈడీ ముందుకు కదిలింది. నిధులు అనుమతుల్లేకుండా తరలించారనే ఆరోపణపై ఆయన మీద గతంలో కేసు నమోదైంది.

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు మరో షాక్ తగిలింది. రవిప్రకాష్ మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. బుధవారంనాడు ఈ కేసు నమోదైంది. 

రవిప్రకాష్ తో పాటు మరో ఇద్దరు టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ నుంచి 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ. 18 కోట్ల నిధులను అనుమతి లేకుండా ఉపసంహరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులో గతంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

Also Read: జైలు నుంచి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విడుదల

దానిపై 2019 అక్టోబర్ లో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ అధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేశారు. 

నకిలీ ఈమెయిల్ అడ్రస్ సృష్టించారనే అభియోగాలపై నమోదైన కేసులో రవిప్రకాష్ కు 2019 అక్టోబర్ లో బెయిల్ వచ్చింది. దాంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ను అరెస్టు చేశారు. 

Also Read: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

click me!