
పారిశ్రామికవేత్త రెబ్బా సత్యనారాయణ (rebba satyanarayana) ఆస్తులను ఈడీ (enforcement directorate) అటాచ్ చేసింది. రూ.100 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ప్రకటించింది. 2002లో ఐడీబీఐ బ్యాంక్‌ను (idbi bank) మోసం చేసినందుకు ఆయనపై సీబీఐ కేసు ఈడీ విచారణ చేపట్టింది. రెబ్బా సత్యనారాయణకు చెందిన వ్యవసాయ భూములు.. చేపల చెరువులు, కమర్షియల్ భూములు, ఫ్లాట్స్‌ను ఈడీ అటాచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.