వైఎస్ఆర్టీపీకి ఎన్నికల సంఘం ఎలక్షన్ సింబల్‌ను కేటాయించింది. ఉమ్మడి గుర్తుగా బైనాక్యులర్‌ను ఈసీ వైఎస్ఆర్టీపీకి కేటాయించింది. దీంతో వైఎస్ఆర్టీపీ అన్ని స్థానాల్లో బైనాక్యులర్ గుర్తుపై బరిలోకి దిగనుంది.
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం సింబల్ కేటాయించింది. ఉమ్మడి ఎన్నికల గుర్తుగా బైనాక్యులర్‌ను కేటాయించింది. వైఎస్ఆర్టీపీ పోటీ చేసే అన్ని స్థానాల్లోనూ బైనాక్యులర్ గుర్తే ఉండనుంది. తాము తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని వైఎష్ షర్మిల ఇటీవలే వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్‌కు ముందు కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనం అవుతుందనే వార్తలు వచ్చాయి. వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ అధిష్టానంతో పలుమార్లు సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తన కోసం, తన అనుచరుల కోసం కొన్ని సీట్లు కావాలని ప్రత్యేకంగా నియోజకవర్గాలను ఆమె కాంగ్రెస్ అదిష్టానం ముందు ఉంచినట్టు తెలిసింది. అయితే, దానిపై ఎలాంటి స్పందన కాంగ్రెస్ నుంచి రావడం లేదు. కొన్ని రోజుల పాటు ఎదురుచూసిన షర్మిల ఇక ఒంటరిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్‌తో విలీనం అంశం ముందుకు సాగకపోవడంతో రాష్ట్రంలోని 119 స్థానాల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేస్తుందని, వైఎస్ఆర్టీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని షర్మిల ఇటీవలే తెలిపిన సంగతి తెలిసిందే.
Also Read: 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతర్‌లో మరణ శిక్ష.. దిగ్భ్రాంతికరం: కేంద్రం
కాంగ్రెస్‌తో విలీన సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు తనకు పాలేరు స్థానం టికెట్ ఇవ్వాలని, మరికొన్ని టికెట్లు కావాలని డిమాండ్ పెట్టినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్లపై సానుకూలంగా స్పందించనట్టు తెలుస్తున్నది.
వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్‌లో విలీనాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచీ వ్యతిరేకించారు. ఖమ్మం నుంచీ కొందరు నేతలు షర్మిల పార్టీ విలీనంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.