కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టడమే ఎజెండా: రాజీనామాకు ముందు ఈటల రాజేందర్

Published : Jun 12, 2021, 11:34 AM ISTUpdated : Jun 12, 2021, 12:17 PM IST
కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టడమే ఎజెండా: రాజీనామాకు ముందు ఈటల రాజేందర్

సారాంశం

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

హైదారబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. హుజూర్ నగర్ లో జరిగేది కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 

ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు మంత్రులుగా కొనసాగుతున్నారని, పార్ట మారే సమయంలో వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని ాయన అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి స్థితిలో రాజీనామా చేయవద్దని కొందరు చెప్పారని, కేసీఆర్ వద్ద వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతారని, తద్వారా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారని ఆయన అన్నారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు.

అయితే, తాను రాజీనామా చేయడానికే సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. వాళ్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేయాలని చెప్పారని ఆయన అన్నారు హుజూరాబాద్ లో జరిగేది కురుక్షేత్రమేనని ఆయన అన్నారు. హుజూరాబాద్ ప్రజలు నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు భయపడరని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన అన్నారు. 

 

తనది వామపక్ష ఎడెండా కాదని, కేసీఆర్ కుటుంబ పాలనకు ఘోరీ కట్టడమే తన ఎజెండా అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మేధావులు, తదితరులతో ఓ కమిటీ వేస్తానని కేసీఆర్ చెప్పారని, ఆ హామీని గంగలో కలిపారని, సమస్యలను చెప్పుకునే దిక్కు కూడా తెలంగాణలో లేదని ఆయన అన్నారు. తనకు టీఆర్ఎస్ బీ ఫారం ఇచ్చి ఉండవచ్చు గానీ గెలిపించింది ప్రజలేనని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?