ఈటెల రాజేందర్ ఎఫెక్ట్: రెండుగా చీలిన హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలు

By telugu team  |  First Published May 16, 2021, 1:44 PM IST

హుజూరాబాద్ శానససభ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆటెల రాజేందర్ ప్రభావం తీవ్రంగానే పడింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు రెండుగా చీలిపోయారు.


కరీంనగర్: హుజూరాబాద్ శాసనసభ నియోజవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభావం తీవ్రంగానే పడింది.  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలో టి ఆర్ ఎస్ నాయకులు రెండుగా విడిపోయారు. తాము టి ఆర్ ఎస్ పార్టీ వైపు ఉంటమనీ కొందరు అంటే మరీ కొందరు తమను భయబ్రాంతులకు గురి చేయవద్దని తాము మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంబడి ఉంటామని చెపుతున్నారు..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం జిల్లా మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజక వర్గం పై దృష్టి పెట్టి నియోజక వర్గ టిఆర్ స్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొంత మంది తాము టిఆర్ఎస్ పార్టీ వైపే ఉంటామని అంటుండగా, మరి కొంత మంది తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తమకు పార్టీ కంటే వ్యక్తులే ముఖ్యమని తమ నాయకుడు ఈటల రాజేందర్ అని అంటున్నారు. 

Latest Videos

undefined

నిన్న జమ్మికుంట మున్సిపల్ ఛైర్మెన్ రాజేశ్వర్ రావు ఐదుగురు కౌన్సిలర్లతో కలిసి తాము టిఆర్ఎస్ పార్టీ వైపే ఉంటామని, తమ నాయకుడు కేసిఅర్ అని ప్రకటించగా తాజాగా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశినీ స్వప్న 14 మంది కౌన్సిలర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

Also Read: ఈటల రాజేందర్ ఫొటోతోనే గెలిచాం: దేసిన స్వప్న సహా 13 మంది కౌన్సిలర్లు

తమ నాయకుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అని తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తమకు ప్రాణభయం ఉందని అన్నారు ఎది ఏమయినా తాము నమ్ముకున్న నాయకుడు ఈటల రాజేందర్ వైపే ఉంటామని అంటున్నారు.

click me!